Sunday, January 19, 2025
HomeTrending Newsరేపటి మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ

రేపటి మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజినల్ కోర్దినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సిఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజేకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్ధికి ఓటు వేయడం ద్వారా అధికార పార్టీ అభ్యర్ధి ఓటమి పాలు కావడం… లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.

సిఎం జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారని, దీనికి అనుగుణంగానే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో కొందరిని తొలగించి వారి స్థానాలు కొందరు కొత్తవారు, మరికొందరు పాతవారితో భర్తీ చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  మరోవైపు,  రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఉంటాయి… ఎవరిని పక్కన పెట్టబోతున్నారో రేపటి సమావేశంలో సిఎం జగన్ ఆయా ఎమ్మెల్యేలకు తేట తెల్లం చేస్తారని, కొత్త అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించి వచ్చే ఎన్నికలకు సమాయాత్తం చేయబోతున్నారనే వాదన కూడా బలంగా వినబడుతోంది.

సిఎం జగన్ గత నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చారు. ముందస్తు ఆలోచనను సిఎం వారితో పంచుకున్నారని సమాచారం. వారి వద్దనుంచి వచ్చిన స్పందనకు అనుగుణంగానే ఎన్నికల ఆలోచన ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్