Monday, February 24, 2025
HomeTrending Newsదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి నుంచి దుర్గమ్మ గుడికి చేరుకోనున్నారు,  పట్టువస్త్రాలు సమర్పించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.  సిఎం రాక సందర్భంగా ఆలయ అధికారులు, విజయవాడ నగర పాలక సంస్థ, సిటీ పోలీస్, జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్