Sunday, February 23, 2025
HomeTrending Newsశనివారం కావలిలో 'మేమంతా సిద్ధం' సభ

శనివారం కావలిలో ‘మేమంతా సిద్ధం’ సభ

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిన్న శుక్రవారం యాత్రకు విరామం ప్రకటించారు. గురువారం రాత్రి జగన్ చింతారెడ్డిపాలెం వద్ద బస చేశారు. శనివారం ఉదయం గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు.
కొవ్వూరు క్రాస్ , సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్