Review time: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రీజినల్ కోర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సమన్వయ కర్తలు పాల్గొననున్నారు. గత నెల 8న ఈ కార్యక్రమంపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించిన జగన్ పలు అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, నెలకు 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో… ఒక్కో దానిలో రెండ్రోజులపాటు నిర్వహించాలని కూడా గత సమావేశంలో నేతలను ఆదేశించారు. దాదాపు 8 నెలలపాటు ఇది కొనసాగుతుందని కూడా ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. అదే సమయంలో ప్రతి నెలా గడప గడపకూ మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించి ఫీడ్ బ్యాక్ పై చర్చిస్తామని కూడా వెల్లడించారు. గత నెలరోజులుగా జరిగిన కార్యక్రమంపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు సిఎం జగన్ ఓ ప్రణాళిక కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలోనే నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.
రాష్ట్రపతి ఎన్నికకు రేపు ఎమ్మెల్యేలు అందరూ అమరావతి రానున్నారు. ఓటింగ్ అనంతరం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సమీక్షా సమావేశం ఉంటుంది.