Wednesday, April 23, 2025
HomeTrending NewsYS Jagan: కడప జిల్లాలో మూడ్రోజులపాటు సిఎం టూర్

YS Jagan: కడప జిల్లాలో మూడ్రోజులపాటు సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు జూలై 8 నుంచి జూలై 10 వరకు మూడు రోజుల పాటు వైయస్సార్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.  జూలై 8న అనంతపురం జిల్లా  కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.05 గంటలకు వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకొని దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు.

రెండో రోజు 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోటలో  ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేసి, వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు.  ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనాన్ని, రాణితోపు  వద్ద నగరవనం  కార్యక్రమాన్ని ప్రారంబిస్తారు.  అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని… గరండాల కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను ప్రారంభించిన అనంతరం పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్‌ఆర్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను  ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు  వైఎస్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేసిన అనంతరం తిరిగి ఇడుపులపాయ చేరుకుంటారు.

జూలై 10న మూడోరోజు  ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకొని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను  ప్రారంభించి అనంతరం  కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌కు ప్రారంభోత్సవం చేసి  పలు ఇతర పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేస్తారు. కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్