Monday, January 20, 2025
HomeTrending NewsYS Jagan: రేపు ఢిల్లీకి సిఎం జగన్

YS Jagan: రేపు ఢిల్లీకి సిఎం జగన్

CM in Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం సమావేశం కానున్నారు. మార్చి 17న ఢిల్లీలో సిఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో సమావేశం అయ్యారు. రెండు వారాల వ్యవధిలోనే మరోసారి ప్రధానితో భేటీ అయ్యందుకు జగన్ ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.

ఇటీవలి సమావేశంలో…విభజన హామీలు వెంటనే అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయాలని  ప్రధానికి సిఎం విజ్ఞప్తి చేశారు.  విభజన జరిగి 9 సంవత్సరాలు పూర్తయినా అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు చాలా వరకూ పరిష్కారానికి నోచుకోలేదని,  వీటిపై వెంటనే దృష్టిసారించాలని ప్రధానిని కోరారు.

రేపటి సమావేశంలో రాష్ట్ర సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే సిఎం ఢిల్లీ వెళ్ళారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్