రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యతిన్చానున్నారు. తొలుత పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్ లో ఐటీసీ సంస్ధ ఏర్పాటుచేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభిస్తారు.
అనంతరం గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సిఎం పాల్గొంటారు. గుంటూరు మెడికల్ కళాశాలలో 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్ ను కూడా సిఎం ఆవిష్కరించానున్నారు.
ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 9.25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌కు చేరుకుంటారు. 9.40 – 10.35 వరకు సుగంధ ద్రవ్యాల పార్క్ లో ఐటీసీ సంస్ధ ఏర్పాటుచేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు, మధ్యాహ్నం 12.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.30 గంటలకు గుంటూరు మెడికల్ కాలేజ్ చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.