Sunday, November 24, 2024
HomeTrending NewsSpandana: ప్రతి శనివారం హౌసింగ్ డే: సిఎం జగన్

Spandana: ప్రతి శనివారం హౌసింగ్ డే: సిఎం జగన్

సీఆర్డీయే ప్రాంతంలో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిఅధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరతా లేదని స్పష్టం చేశారు. గత ఏడాది  10,200 కోట్లు ఖర్చు చేశామని,  ఈ ఏడు 15,810 కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. శాశ్వత భూ రక్ష మరియు భూ హక్కు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిలా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో  ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలుపై యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.

సమీక్ష సందర్భంగా సిఎం సూచనల్లో ముఖ్యాంశాలు:

  • పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి
  • ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది
  • వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలి
  • ఇప్పటికే 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి
  • కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాలి.
  • ప్రతి శనివారం హౌసింగ్‌ డేగా పరిగణించాలి.  అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలి
  • మనం చేపట్టిన సమగ్ర భూ సర్వే దేశానికే ఆదర్శం
  • మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోంది
  • కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టి రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతో పాటు తర్వాత దశల్లో సర్వేపై ప్రణాళిక రూపొందించాలి.
  • పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలి
  • మే 25 నుంచి రెండో దశ గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుంది
  • పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమానికి సరిపడా నిధులు ఉన్నాయి
  •  తల్లిదండ్రులు కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లుఉన్నాయి
  • పనులను వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే
  • తదుపరి ఖర్చులకోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి, నాడు – నేడుకు నిధుల కొరత లేదు

  • మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు -నేడు పనులు పూర్తవుతాయి
  •  8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5.18 లక్షల ట్యాబులు ఇచ్చాం
  • వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చూడాలి
  • అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి
  • సమస్యలుంటే..ఏం చేయాలన్నదానిపై దానిపై ఎస్‌ఓపీ రూపొందించాం
  • స్కూళ్లు జూన్‌ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలి,  ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదు
  • దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది:
  • పంపిణీపై మంచి ప్రోటోకాల్‌ను పాటించాలి
  • అలాగే జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువుల క్వాలిటీపైన కూడా బెస్ట్‌ ప్రోటోకాల్‌ పాటించాలి:
  • మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి
  • ప్రతి కాలేజీలోకూడా ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి
  • వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ పెట్టాలి
  • జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలి
  • మాదక ద్రవ్యాల నివారణే వీటి ఉద్దేశం కావాలి
  • కాలేజీల్లో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి
  • వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలి
  • పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి
  • మాదకద్రవ్యాల తయారీ, రవాణా, పంపిణీ చేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి
  • గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి:
  • 15వేలమందికిపైగా మహిళా పోలీసులు ఉన్నారు.  వారు సమర్థవంతంగా పనిచేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్