CM in Gaushala:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోశాల మొత్తాన్ని కలియ దిరిగిన సిఎం వాటి ఆహారం, వాటి పోషణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోశాల సంరక్షుకులుగా ఉన్న సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.