Friday, May 9, 2025
HomeTrending Newsవిశాఖలో అమెరికన్ కాన్సులేట్: సిఎం ఆకాంక్ష

విశాఖలో అమెరికన్ కాన్సులేట్: సిఎం ఆకాంక్ష

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు.  తెలుగు వ్యక్తి, అందులోనూ తన సొంత జిల్లాకు చెందిన వీణా రెడ్డి  యునైటెడ్ స్టేట్స్, ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టర్ గా ఉండడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు సిఎం జగన్.  వీణా రెడ్డి తోడ్పాటుతో అమెరికన్ కార్నర్ తో మొదలైన ఈ ప్రస్థానం విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు వరకూ సాగాలని జగన్ ఆకాంక్షించారు.

దేశంలో అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తర్వాత విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు పట్ల సిఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా  విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించిన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్