తెలంగాణ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పోలిక లేదని స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో కెసిఆర్ పదేళ్ళ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. బడ్జెట్ లో కేటాయింపులు ప్రకటిస్తున్నా… వాస్తవంగా బిసిలకు అవకాశాలు కల్పించటంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమయిందని, తెలంగాణలో కొన్ని వర్గాలు, కులాలకే మేలు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
అందుకు భిన్నంగా సిఎం జగన్మోహన్ రెడ్డి బిసిల్లోని అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించేలా చొరవ తీసుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి సంక్షేమ ఫలాలు అందుకోని వర్గాలకు పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. అమ్మ ఒడి, కాపు నేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాలు నిదర్శనం.
కెసిఆర్ తన కుటుంబంలో తనతోపాటు నలుగురికి పదవులు కట్టబెట్టారు. సిఎంగా కెసిఆర్ కుమారుడు కేటిఆర్ మంత్రిగా, కుమార్తె కవిత ఎమ్మెల్సీ, అల్లుడు హరీష్ మంత్రిగా, తోడల్లుడి కుమారుడు సంతోష్ రావు ఎంపి ఇలా పదవుల పందేరం జరిగింది. తెలంగాణ వచ్చాక కేవలం కెసిఆర్ కుటుంబమే బాగుపడిందనే బావన ప్రజల్లో పాతుకుపోయింది. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా…నిర్ణయం జరగాలన్నా వీరి కనుసన్నల్లోనే జరిగేవని అపవాదు ఉంది.
ఇందుకు పూర్తి భిన్నంగా సిఎం జగన్ తన కుటుంబ సభ్యులను తీసుకురాలేదు. కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. బంధువులు ఎంపి అవినాష్ రెడ్డి, టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి ఉన్నా ప్రభుత్వ వ్యవహారాల్లో వారి జోక్యానికి అవకాశం కల్పించలేదు.
ముఖ్యమంత్రి అయ్యాక సిఎం కెసిఆర్ సచివాలయం రావటం మానేశారు. దీంతో అధికారుల్లో జవాబుదారీతనం లోపించింది. ప్రజలు తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అటు ఏపిలో దేశంలోనే తొలిసారి పాలనా యంత్రాంగాన్ని క్షేత్రస్తాయికి తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు, పథకాలు లబ్దిదారులకు ఇంటివద్దనే అందించేలా సిఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు.
తెలంగాణలో మెజారిటీ నియోజకవర్గాల్లో తరతరాలుగా పాతుకుపోయిన కుటుంబాల వారికే ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న శాసనసభ్యులను మార్చలేదు. ప్రజలు సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకున్నా…కొందరు ఎమ్మెల్యేల అవినీతిపై బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల విషయంలో సిఎం జగన్ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ప్రజాభిమానం కలిగిన నేతలకు అవకాశం ఇవ్వటం, అధిక జనాభా కలిగిన వర్గాలకు దామాషా పద్దతిలో ప్రాతినిధ్యం కల్పించటం ప్రథమ్యాలుగా ఆచరిస్తున్నారు.
2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో బలమైన కాపు సామజికవర్గాన్ని కాదని శెట్టిబలిజ నేత చెల్లుబోయిన వేణుగోపాల్ కు YCP టికెట్ ఇవ్వగా.. పేరు ఖారారైన రోజు నుంచే గెలుపు ఖాయమని ప్రచారం జరిగింది. కాపులను కాదని శెట్టిబలిజకు టికెట్ ఇవ్వటం అప్పట్లో సంచలనం. బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారనేందుకు ఓ మచ్చుతునక.
విద్యారంగాన్ని కెసిఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. బడ్జెట్ లో ఏడు శాతం కన్నా తక్కువగా కేటాయింపులతో కెసిఆర్ నాయకత్వంపై బిసిల్లో అనుమానాలు తలెత్తాయి. రాష్ట్రంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నా సిఎం జగన్ విద్యా రంగానికి పది శాతం నిధులు కేటాయించారు.
విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పేదల కుటుంబాల విద్యార్థులను ఆదుకునేందుకు అమ్మ ఒడి సత్ఫలితాలు ఇచ్చాయి. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ విప్లవాత్మక మార్పులకు దారితీసింది. BYJUSతో ఒప్పందం చేసుకొని ట్యాబులు అందించి ఆన్లైన్ పాఠాలు నేర్చుకునేందుకు అవకశం కల్పించారు.
ప్రజల సంక్షేమం, వెనుకబడిన వర్గాలకు తోడ్పాటే లక్ష్యంగా సిఎం జగన్ ప్రభుత్వం విధానాలు రూపొందించి అమలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నవరత్నాలను ప్రజలకు చేరువ చేయటంలో సిఎం జగన్ సఫలమయ్యారని వివిధ నివేదికల్లో వెల్లడైంది.
-దేశవేని భాస్కర్