Sunday, February 23, 2025
HomeTrending Newsస్వప్నలోక్ మృతుల కుటుబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా

స్వప్నలోక్ మృతుల కుటుబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ సూచించారు.

Also Read : స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్