Sunday, January 19, 2025
HomeTrending Newsపర్యాటక శాఖకు సిఎం అభినందన

పర్యాటక శాఖకు సిఎం అభినందన

Well Done: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, మన దేశం నుంచి సిఫార్సు చేయబడ్డ మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి ఈ అరుదైన ఘనతను సాధించింది.

ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండీ బి. మనోహర్ రావులు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలుసుకుని వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. పర్యాటక శాఖ అధికారుల కృషిని సీఎం అభినందించారు

Also Read : పోచంప‌ల్లికి అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్