Sunday, February 23, 2025
HomeTrending News15 నుంచి రెవెన్యూ సదస్సులు

15 నుంచి రెవెన్యూ సదస్సులు

To resolve disputes: రాష్ట్రంలో జూలై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక సదస్సు 11న ప్రగతి భవన్ లో జరగనుంది.  ఈ విషయాన్ని సిఎంవో అధికారులు ఓ ప్రకటనలో  తెలియజేశారు. ఇంకా అక్కడో, ఇక్కడో మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డిఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు.

సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సును ఈ నెల 11వ తేదీన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్