Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం కెసిఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

సిఎం కెసిఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈద్ ఉల్ ఫిత‌ర్ ప‌ర్వ‌దిన వేడుక‌ల‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌న్నారు. ప‌విత్ర ప్రార్థ‌న‌ల‌తో అల్లా దీవెన‌లు పొందాల‌ని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన జీవ‌న‌శైలి, ఆధ్యాత్మిక‌త‌ను పెంపొందిస్తుంద‌న్నారు. గంగా జ‌మునా తెహ‌జీబ్‌కు తెలంగాణ ప్ర‌తీక అని కేసీఆర్ పేర్కొన్నారు. లౌకిక‌వాదం, మ‌త సామ‌ర‌స్య ప‌రిర‌క్ష‌ణ‌లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని కొనియాడారు. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడుతుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ముస్లింల సంక్షేమానికి భారీగా నిధులు
ముస్లిం మైనార్టీల అభ్యున్న‌తి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ముస్లింల సంక్షేమానికి ఏటా భారీగా నిధులు కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. మైనార్టీ యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణనిచ్చి, స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. మైనార్టీ విద్యార్థుల‌కు గురుకులాల ద్వారా నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్‌ల ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్య‌కు ప్ర‌భుత్వం బాట‌లు వేస్తోంద‌ని కేసీఆర్ తెలిపారు

Also Read : ముస్లిం సోదరులకు సిఎం జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌‘

RELATED ARTICLES

Most Popular

న్యూస్