Monday, January 20, 2025
HomeTrending Newsముకర్రమ్ ఝా మృతిపై సిఎం సంతాపం

ముకర్రమ్ ఝా మృతిపై సిఎం సంతాపం

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి మరణించిన ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైద్రాబాద్ కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ కి సిఎం తెలిపారు. సిఎం సూచనల మేరకు అందుకు సంబంధించి ఎకె ఖాన్ సమన్వయం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్