కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం కామెంట్స్
దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలి. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ గా చేపట్టి, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలి. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలి. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి.
హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా…సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు. మళ్ళీ వస్తా…. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తాను.
నిధులకు ఎలాంటి కొరత లేదనీ, 1000 కోట్ల రూపాయలైన కేటాయించేందుకు సిద్ధమని చెప్పిన సీఎం..కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండడట్టుకు తరలించి భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా నీటి వసతిని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని స్పష్టం చేసిన సీఎం.. నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్ సాయికి సూచించారు.
ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటిదాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులకు తెలిపిన సీఎం గుట్టలపై నుంచి సహజంగా ప్రవహించే నీటి ప్రవాహం సంతులోని లొద్దిలో నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి చర్చించారు. గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొండగట్టులో నీటి బాధ తప్పిందని సీఎంకు వివరించిన అధికారులు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమాలకర్, ఎంపి దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సంజయ్, కె. విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ రావు, ఎఫ్ డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, డిసిసిబి ఛైర్మన్ అల్లోల శ్రీకాంత్ రెడ్డి , గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, ఆర్ అండ్ బి అధికారులు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఆలయ స్తపతి ఆనందర్ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు విడుదల