Thursday, May 29, 2025
HomeTrending Newsవరంగల్ ఎంజిఎం కు కెసియార్

వరంగల్ ఎంజిఎం కు కెసియార్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ నేడు వరంగల్  ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న  ఐసియు, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకుంటారు. వైద్యులతో కోవిడ్ ఏర్పాట్లపై చర్చిస్తారు.

మొన్న బుధవారం  సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సిఎం గంటపాటు కోవిడ్  పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి  అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని భరోసా ఇంచ్చారు.

వరంగల్ పర్యటనలో ఎంజిఎం ఆస్పత్రితో పాటు, సెంట్రల్ జైలును కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తారు. జైలును శివారు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో వుంది, దీనిపై జైలు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్