Sunday, February 23, 2025
HomeTrending Newsశ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మొదట బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సిఎం జగన్ కు ఆలయ అర్చకులు పరివట్టం కట్టారు. ఆ తర్వాత పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో సిఎంకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టిటిడి ఛైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. 2022 సంవత్సరానికి టిటిడి దేవస్థానం క్యాలెండర్‌, డైరీలను సిఎం ఆవిష్కరించారు. గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. రేపు ఉదయం మరోసారి స్వామివారిని సిఎం దర్శించుకుంటారు.

తిరుమల పర్యటనలో భాగంగా నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సిఎం అక్కడినుంచి బర్డ్‌ హాస్పిటల్‌ చేరుకుని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను, గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం అందించారు.

ఆ తర్వాత తిరుమల కొండపైకి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. సిఎం జగన్ వెంట డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర మంత్రులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, , టిటిడి సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్