Virtual Meet on Covid: దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి అధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. కోవిడ్ విస్తరణ, నివారణా చర్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశంలో కోవిడ్ విస్తరణ, తాజా పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖా ప్రజంటేషన్‌ద్వారా వివరించింది. మొదటి డోస్ 100శాతం పూర్తిచేసిన రాష్ట్రాల్లో కూడా ఏపీ ఉందని వెల్లడించింది. ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పలు సూచనలు చేశారు.
సిఎం తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్‌మెంట్,వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Also Read : త్వరలోనే సానుకూల నిర్ణయం : చిరంజీవి