Friday, September 20, 2024
HomeTrending Newsమేడిగడ్డ పరిశీలించిన సిఎం, మంత్రులు

మేడిగడ్డ పరిశీలించిన సిఎం, మంత్రులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్-ఎంఐఎం-సిపిఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. 21వ పిల్లర్ వద్ద  కుంగిన ప్రాంతాన్ని, పగుల్లను పరిశీలించారు.
కాళేశ్వరంపై నిగ్గు తేల్చేందుకు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవలు, నిజాలను తెలంగాణ సమాజానికి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నేడు వెల్లడించింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరి వెళ్ళారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ తానే అని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్.. మేడిగడ్డ కూలితే కనీసం స్పందించలేదని,  కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా ఎలా మారిందో తెలంగాణ సమాజానికి, దేశానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపిస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు.
” గత పాలనలో మేడిగడ్డ పాపం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఈ ప్రయాణం.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మేము చేసిన ప్రమాణం… ఈ ప్రయత్నం” అంటూ సామాజిక మాధ్యమాల్లో సిఎం పోస్ట్ చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్