Saturday, November 23, 2024
HomeTrending NewsCM Jagan: విమర్శలకు తావివ్వొద్దు: జగన్

CM Jagan: విమర్శలకు తావివ్వొద్దు: జగన్

వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస  కార్యక్రమాలు సమర్థవంతంగా  చేపట్జటాలని,  ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం సమీక్షించారు.  అల్లూరిసీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు  దీనిలో పాల్గొన్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలపై కలెక్టర్లకు సిఎం దిశానిర్దేశం చేశారు.

సిఎం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలు:

  • ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో ఎలా వ్యవహరిస్తుందో మీ అందరికీ తెలుసు
  • నేను పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచి విపత్తుల సమయంలో నేను ఏ రకంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నానో మీరు అందరూ గమనించే ఉంటారు
  • దేశంలోని దాదాపు ఇతర ముఖ్యమంత్రులంతా ఈరకంగానే కార్యకలాపాలను నిర్వహిస్తుండడం మనం అంతా చూస్తున్నాం
  • అధికారులకు అవసరమైన నిధులు, వనరులు సమకూర్చి వారికి సమర్థవంతంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు జరిగేలా చేస్తున్నాం
  • విపత్తు సంకేతాలు రాగానే కలెక్టర్లకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం
  • మీరు అడిగిన టిఆర్‌ –27 కింద నిధులు సహా, అవసరమైన వనరులను సమకూరుస్తూ అధికారులను ఎంపవర్‌ చేస్తున్నాం
  • సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం నాలుగేళ్లకాలంగా తోడుగా నిలుస్తోంది
  • తర్వాత బాధితులకు సరైన విధంగా సహాయం అందించేలా తగినన్ని చర్యలు తీసుకోవడానికి సరిపడా సమయం ఇస్తున్నాం
  • ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నేను స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో కలెక్టర్లుగా మీరు, అధికారులు, సిబ్బంది సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను
  • బాధితులను స్వయంగా అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను
  • ఈసారికూడా నేను వస్తాను, క్షేత్రస్థాయిలో మీరు తీసుకున్న చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను
  • ఒక్క బాధిత కుటుంబం కూడా వచ్చి, వరద ప్రభావితమైనప్పటికీ తమకు సహాయం అందలేదని చెప్పే పరిస్థితి ఉండకూడదు
  • వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలని, మానవీయతతో, సానుభూతితో ఉండాలని ఇదివరకే నేను చెప్పాను. మరోసారి స్పష్టంచేస్తున్నాను
  • మనం ఆ పరిస్థితుల్లో ఉంటే అధికారులనుంచి ఎలాంటి సహాయం కోరుతామో ఆతరహాలోనే అధికారులుగా మీరు స్పందించాలి
  • సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను
  • నేను ఏ జిల్లాకు వచ్చేదీ ఆదివారం సాయంత్రం సీఎంఓ అధికారులు వెల్లడిస్తారు
  • క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తాను
  • నేను ఏ జిల్లాకు వచ్చినా మా కలెక్టర్‌ బాగా చేయలేదు అన్న మాట రాకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్