Sunday, January 19, 2025
HomeTrending Newsఉద్యోగ సంఘాలతో నేడు సిఎం భేటీ

ఉద్యోగ సంఘాలతో నేడు సిఎం భేటీ

PRC on Today?: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో నేడు సమావేశం కానున్నారు.  నేటి మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సిఎం భేటీ అవుతారు. ఏపీ ఎన్జీవో, రెవెన్యూ, సచివాలయ, ఉపాధ్యాయ, విశ్రాంత,  ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు చెందిన 16 సంఘాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. దీని తర్వాత పీఆర్సీ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్