రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి కురుపాం బహిరంగ సభ వద్దకు చేరుకుని ప్రసంగం అనంతరం జగనన్న అమ్మ ఒడి నిధులు కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
YS Jagan: 28న సిఎం కురుపాం టూర్, అమ్మ ఒడి సాయం విడుదల
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గత మూడురోజులుగా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశామమై సిఎం సభను జయప్రజం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రం వేదిక ఏర్పాట్లను పాలకొండ ఎమ్మెల్యే కళావతి ,అవనాపు విక్రమ్,అధికారులు,నాయకులు ,కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు.