Sunday, January 19, 2025
HomeTrending News'ఏపీఐఐసీ'కి 50 ఏళ్ళు- అభినందించిన సిఎం

‘ఏపీఐఐసీ’కి 50 ఏళ్ళు- అభినందించిన సిఎం

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్ధ (ఏపీఐఐసీ)50 వ వసంతంలోకి అడుగుపెట్టింది.   ఏపీఐఐసీ గోల్డెన్‌ జూబ్లీ లోగోను సీఎం క్యాంప్‌ కార్యాలయంలోముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సీఎం స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తామన్న ఏపీఐఐసీ ప్రతినిధులు, ఈ ఏడాది పాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండి జేవీఎన్‌. సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు ఉన్నారు.

Also Read : ఏపీఐఐసీ ఛైర్మన్ తో ‘బీఈఎల్’ ప్రతినిధుల భేటీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్