Tuesday, February 25, 2025
HomeTrending Newsఅంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు - సీఎం వైఎస్‌ జగన్‌

అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు – సీఎం వైఎస్‌ జగన్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం.. సంక్షేమ కార్యక్రమాలు, సాధికారత దిశగా కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా సిఎం అన్నారు. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మంత్రులు పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, నందిగం సురేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘరామ్‌.

Also Read : అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక – సిఎం కెసిఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్