Thursday, November 21, 2024
HomeTrending Newsరెండు కమిటీల ఏర్పాటుకు తెలుగు సిఎంల భేటీ నిర్ణయం

రెండు కమిటీల ఏర్పాటుకు తెలుగు సిఎంల భేటీ నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ ప్రజా భవన్ లో జరిగిన సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు హాజరు కాగా…. ఏపీ నుంచి మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్… తెలంగాణ నుంచి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు కూడా  పాల్గొన్నారు.  రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒకటి, అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, భద్రాచలం ముంపు గ్రామాల సమస్యపై కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా ఓ లేఖ రాయాలని…. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్ లోని అంశాల పరిష్కారానికి కూడా చొరవ తీసుకోవాలని ఈ భేటీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్