మూడు చింతలపల్లిలో రెండు రోజుల పాటు దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు పూర్తైన ఏర్పాట్లు. 24న ఉదయం 10 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తోపాటు దళిత, గిరిజన ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలతో రెండు రోజులు దీక్షలో పాల్గొంటారు. వర్షం పడ్డా ఆటంకాలు లేకుండా సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయ్యాక దళిత గిరిజన అంశాలపై ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలు చేపట్టారు. ఇంద్రవెళ్లిలో ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం నాడు భారీ బహిరంగ సభతో ప్రారంభించిన సభ సక్సెస్ అయ్యింది. తర్వాత 18న చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని రావిర్యాలలో రెండో సభ నిర్వహించిన కాంగ్రెస్ ఆ సభ ను కూడా పెద్ద ఎత్తున చేపట్టడంతో క్యాడర్ లో మంచి జోష్ వచ్చింది. మూడో కార్యక్రమంలో భాగంగా 48 గంటల దీక్ష కు రేవంత్ రెడ్డి పూనుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని మూడుచింతల పల్లిలో ఈ దీక్ష జరగనుంది.
దీక్ష ఏర్పాట్లను, సభ స్థలాన్ని సోమవారం దళిత, గిరిజన నాయకులు సందర్శించారు. వర్కింగ్ ప్రసిడెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి అజారుద్దీన్, వర్కింగ్ ప్రసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్, రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ రాజయ్య, N ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితరావ్, ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీకాంత్, ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షులు బలమూరి వెంకట్, ఫిషెర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, మాజీ మంత్రి పుష్పలీల, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి హర్కర వేణుగోపాల్, నియోజక వర్గ నాయకులు జంగయ్య యాదవ్ హరి వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.