Saturday, November 23, 2024
HomeTrending Newsసూపర్ స్టార్ సామాజిక స్పృహ ఆదర్శనీయం - సిఎం కెసిఆర్

సూపర్ స్టార్ సామాజిక స్పృహ ఆదర్శనీయం – సిఎం కెసిఆర్

ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడు గా, నిర్మాత గా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

 

350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సూపర్ స్టార్ మృతికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లతో పాటు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్