Tuesday, September 24, 2024
HomeTrending Newsరేవంత్ బ్లాక్ మైలర్ .. చీటర్ -మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు

రేవంత్ బ్లాక్ మైలర్ .. చీటర్ -మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీతో బాధతోనే అనుబంధం తెంచుకుంటున్న అని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. రాష్ట్ర ఇంచార్జ్ లు అందర్నీ సమన్వయ పరచాలి…కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఇన్చార్జీలు పీసీసీలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా మర్రి శశిధర్ రెడ్డిని ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వెళ్లేందుకు దారి తీసిన పరిణామాల్ని మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులకు వివరించారు.

మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ …

తెలంగాణలో టిఆర్ఎస్ తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక అన్ని ఎన్నికల్లో ఒడిపోయాము. పిసిసి అధ్యక్షుడుగా ఆరేళ్ళు ఆయన్ని ఎలా కొనసాగించారు. కాంగ్రెస్లో దురదృష్టకర పరిణామాలతోటే ఉత్తమ్ కుమార్ ఆరేళ్ళు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. పీసీసీలకు ఏజెంట్లుగా… పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ లు పనిచేశారు. బంగారు బాతుగా పీసీసీ లను భావిస్తున్నారు. ఇంచార్జి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం కలిగిస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్చార్జికి, ఏఐసిసి నేత వేణుగోపాల్ వరకు డబ్బు కీలకమైంది. డబ్బులు తీసుకోవడం నేను చూడలేదు కానీ… వ్యవహారం చూస్తే అలాగే ఉంది. పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని వివరించేందుకు టైం ఆడిగితే పట్టించుకోవడం లేదు.

సోనియా గాంధీ కూడా పార్టీని చక్కదిద్దటంలో నిస్సహాయకురాలు అయ్యారు. కోకపేట ల్యాండ్ అక్రమాలు జరిగాయని… దాని విషయంలో పార్టీ తరపున కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ రేవంత్…సైలెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్8 న… రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. కోకపేట ల్యాండ్ పై సీబీఐ విచారణ చేయాలని సీబీఐ కి లేక రాశాడు. ఆ తరవాత కోకా భూముల గురించి మళ్ళీ మాట్లాడలేదు. రేవంత్ కి ఒకటో విడత..రెండో విడత ముడుపులు అందాయి అనుకున్న. రేవంత్ రెడ్డి బ్లాక్ మైలర్ .. చీటర్ అని మర్రి శశిధర్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు.

Also Read : రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ బాగుపడదు – మర్రి శశిధర్ రెడ్డి విమర్శ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్