తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కనీసం కో ఆర్డినేషన్ లేకుండా సభ నడుస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంశం లెవనెత్తిన్నప్పుడు స్పీకర్ స్పందించాలన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 176(1) ప్రకారం గవర్నర్ అడ్రెస్ చేయాలని స్పష్టంగా ఉందని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు.
రాజ్యాంగం ప్రకారమే మేము పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంశం అడిగామన్న శ్రీధర్ బాబు ప్రజల సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. సభ వాయిదా పడి నాలుగు నెలలు గడుస్తున్నా సభ ప్రొరోగ్ ఎందుకు కాలేదని అడిగే ప్రయత్నం చేసామని, సభలో సభ్యుల హక్కులు కాపాడలేదని స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.