Monday, February 24, 2025
HomeTrending News13న ఈడి కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసన

13న ఈడి కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసన

కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే.. ప్రతి కార్యకర్త స్పందించాలని పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో టీపీసీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, కోశాధికారి సుదర్శన్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే….

నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదు. అయిన కూడా ఈ.డి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు  నోటీసీలు ఇచ్చారు. వారిని ఈ.డి నోటీసులతో భయపెట్టాలని బిజెపి చూస్తుంది. ఈ విషయంలో శాంతి యుత నిరసన వ్యక్తం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. రాహుల్ గాంధీ సోమవారం నాడు ఈ.డి కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంతవరకు ఈ.డి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలి.

15వ తేదీన అల్ పార్టీ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం చేతులైతేసింది. ఈ విషయంలో అన్ని పార్టీలతో సమావేశం పెడతాం. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను కూడా ఆహ్వానించుదాం. రైతు రచ్చబండ కార్యక్రమాలు ఈ నెల 21 వరకు చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగిస్తున్నాం. నాయకులు పని చేయకపోతే పదవులు రావు.. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావు. గ్రామాల్లో తిరగాలి.. ప్రతి గడప తట్టాలి.. పెద్ద నాయకులు బాగా పనిచేస్తుంటే కాబోయే నాయకులు ప్రజల్లో తిరగడం లేదు. ఎప్పటికప్పుడు ఏఐసీసీ కి నివేదికలు వెళ్తున్నాయి. పనిచేసి ప్రజల్లో నిత్యం ఉండే వాళ్ళకే పదవులు వస్తాయి..

Also Read : పల్లెల్లో అభివృద్ధి వెలుగులు – మంత్రి ఎర్రబెల్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్