Sunday, January 19, 2025
HomeTrending News9న కరీంనగర్ లో కాంగ్రెస్ భహిరంగ సభ

9న కరీంనగర్ లో కాంగ్రెస్ భహిరంగ సభ

బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో బ్రమలు తొలగిపోయాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారని, అందుకే కాంగ్రెస్ చేపట్టిన హత్ సే హత్ జోడో పాదయాత్ర కు ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ఈనెల 9న కరీంనగర్ లో కాంగ్రెస్ భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హాజరుకానున్నారని, రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగానే కరీంనగర్ లో సభ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ ను ఫోన్ చేసి బెదిరించడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కోమటిరెడ్డికి తగదని, చెరుకు సుధాకర్ ఈ అంశాన్ని పీసీసీ కి పిర్యాదు చేశారని చెప్పారు. మేము ఈ అంశాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.

కరీంనగర్ లో హాథ్ సే హాథ్ జోడో బహిరంగ సభకు అత్యంత ప్రాధాన్యత ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2004లో కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలోనే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రకటన చేశారని గుర్తు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర మూడు పార్లమెంట్ నియోజక వర్గాలలో పూర్తయవుతాయని, కరీంనగర్ సభ విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్