Sunday, January 19, 2025
HomeTrending Newsవేగంగా సచివాలయ నిర్మాణం

వేగంగా సచివాలయ నిర్మాణం

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్క్ చార్ట్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో చూసారు.వర్క్ సైట్ లో అన్ని విభాగాల నుంచి బ్లాక్ ల వారిగా సంబంధించిన సిబ్బంది ఉన్నారో లేదో తనిఖీ చేశారు. సెక్రటేరియట్ భవన ముందు భాగం 3 ఫ్లోర్స్,వెనక వైపు 4 ఫ్లోర్స్ స్లాబ్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని అధికారులు మంత్రి కి వివరించారు..పనుల్లో ఇంకా వేగం పెంచాలని,నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని,ఆర్ అండ్ బి అధికారులను మంత్రి ఆదేశించారు..

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిర్మాణం పకడ్బందీగా జరుగుతున్నట్టు మంత్రి చెప్పారు. 200 సంవత్సరాలు నిర్మాణం పటిష్టంగా ఉండేలా,భూకంపాలు సైతం తట్టుకునేలా నాణ్యతతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐఐటి నిపుణుల సూచన,స్ట్రక్చర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

మంత్రి వెంట ఆర్ అండ్ బి స్పెషన్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ,స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.ఈ సత్యనారాయణ,ఈ.ఈ శశిధర్, షాపూర్ జి సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ పలువురు అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్