ఇతర దేశాల్లో కోవిడ్ కేస్ లు పెరుగుతున్న నేపథ్యం లో అలెర్ట్ అయిన కేంద్రం…అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జపాన్, యుఎస్ఎ, కొరియా, బ్రెజిల్ & చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నెట్‌వర్క్ ద్వారా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పంపించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మ్యాప్ చేయబడిన INSACOG జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ (IGSLలు)కి రోజువారీ ప్రాతిపదికన, సాధ్యమైనంతవరకు అన్ని పాజిటివ్ కేసుల నమూనాలను పంపాలని అన్ని రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నాయి. భారత్‍లో కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే రెండేళ్ల నాటి పరిస్థితులు వస్తాయి. పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపాలని, కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read : చైనాలో భారీగా కరోనా కేసులు