Friday, November 22, 2024
HomeTrending Newsత్వరలో కేసులు పెరుగుతాయి

త్వరలో కేసులు పెరుగుతాయి

Corona :  జనవరికి మన దేశంలో కేసులు మళ్ళీ పెరుగుతాయా ? జనవరి కో … మార్చ్ కో .. కేసులు పెరుగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. మహారాష్ట్రలో జనవరిలో ఓమిక్రాన్ వ్యాపిస్తుందని ఇప్పటికే ఆ రాష్ట్ర వైద్య శాఖ [ప్రకటించింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భయాందోళనలు అవసరం లేదని వైద్య వర్గాలు భరోసా ఇస్తున్నాయి.

బాగా చదివి అర్థం చేసుకోవలసిన అంశాల్లో ముఖ్యమైనవి మన ఇమ్మ్యూనిటి లో రెండు రకాల పోలీస్ / సెక్యూరిటీ ఫోర్సెస్ వున్నాయి. ఒకటి యాంటీబోడీ లు. ఇవి గేట్ దగ్గర కాపలా ఉన్న వాచ్మెన్ లాంటివి. ఇవి ఉన్నంత వరకు దొంగలోపలికి రాలేడు. అంటే ఇన్ఫెక్షన్ సోకదు. సమస్య ఏమిటంటే ఇన్ఫెక్షన్ సోకిన లేదా వాక్సిన్ వేసుకొన్న ఆరు లేదా మహా అంటే ఎనిమిది నెలలు మాత్రమే యాంటీబోడీలు రక్తంలో ఉంటాయి. ఎప్పుడూ యాంటీబోడీలు ఉండాలంటే సంవత్సరానికి రెండు సార్లు వాక్సిన్ వేసుకోవాలి.

ఇక రెండవ సెక్యూరిటీ ఫోర్స్ టి సెల్స్. ఇవి శరీరంలోకి దొంగ అంటే వైరస్ సోకాక తమ దాడిని మొదలుపెడతాయి. గతంలో వైరస్ ను ఇవి గుర్తు పెట్టుకొని ఉంటాయి (గతంలో సోకిన వారికి / వాక్సిన్ వేసుకొన్న వారికి ).  ఆ అనుభవం తో ఇవి అంటే టి సెల్స్ వైరస్ ను చీల్చి చెండాడేస్తాయి. అంటే వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. అంటే టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది. కానీ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మహా అంటే ఒకటి రెండు రోజుల వొళ్ళు  నలకడతో కోలుకుంటారు. అంటే జలుబు లాగా అన్న మాట. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మన పూర్వీకులను స్పానిష్ ఫ్లూ వైరస్ చంపింది. మిగతా వారికి టి సెల్స్ రక్షణ వచ్చింది. మనం ఫ్లూ కు సంబంధించి వాక్సిన్    వేసుకొన్నామా ? ? లేదే ? మరి అదే వైరస్ అదే జలుబు వైరస్ సోకితే,  సమస్య లేకుండా ఎలా భయటపడ్డాము ? టి సెల్స్ రక్షణ.

ఒకటి ఇన్ఫెక్షన్ కు.. అంటే వైరస్ మన శరీరంలో ప్రవేశించడానికి లేదా వ్యాధి సంక్రమణ కు రెండు ఖాయిలా పడడానికి అంటే మోర్బీడిటీ తేడా గుర్తించాలి. మన జీవితంలో ఇక పై ఎన్నో సార్లు మనం కరోనా ఇన్ఫెక్షన్ కు గురవుతాము. ఇది ఖాయం. వద్దనుకొంటే సంవత్సరానికి రెండు డోసులు తప్పదు. అప్పుడు గేట్ దగ్గర జీవితాంతం వాచ్ men లు వుంటారు. కాబట్టి అదిగో సోకింది ఇదిగో సోకింది ఇదిగో కేసులు పెరుగుతున్నాయి అంటూ లెక్క పెట్టడం ఆపేయాలి. ఇన్ఫెక్షన్ సమస్య కాదు. వ్యాధి తీవ్రతే సమస్య. ఇక అది రాదు. అంటే వేవ్ లు అంటే ఆసుపత్రి ముందు క్యూలు లాంటివి ఉండవు. కేసులు పెరిగితే ..”కేసులు ..కేసులు ..వేవ్ లు “ అంటే సంవత్సరానికి రెండు సార్లు జాతర తప్పదు.

మరి టి సెల్స్ మోసం చేస్తే ? ఇన్ఫెక్షన్ సోకితే ఎంతైనా రిస్క్ కదా ?

నిన్నటిదాకా జలుబు గురించి ఇలా ఆలోచించావా ? లేదే ! జలుబు వైరస్ విషయంలో టి సెల్స్ మోసం చేశాయా ? లేదే. మరి సోకితే రిస్క్ అసలు ఉండదా ? కింది కేటగిరీ వారికి ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటుంది.

1. బాగా భయపడేవారు. భయపడితే ఇమ్మ్యూనిటి అవుట్. ఇలాంటివారికి దేవుడు కూడా సాయం చేయలేడు. ఇంకా కరోనా అంటే విపరీతంగా భయపడేవారు ఎవరినీ నమ్మని వారు ఇక పై సంవత్సరానికి రెండు సార్లు పొడిపించుకోవడం బెటర్. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో వాక్సిన్ కంపెనీలు లేవు. మనం బతికి పోయాము. ఇప్పుడు కరోనా పేరుతొ భయపెట్టి శాశ్వత కస్టమర్ లను రూపొందించుకునే పనిలో ఫార్మసురులు వున్నారు. నమ్మితే టి సెల్స్ రక్షణ లేదా మీరు వాక్సిన్ కంపెనీకి పెర్మనెంట్ కస్టమర్ .. జీవితాంతం. చాలా సింపుల్. రెండు డోసులు వేసుకోండి.

మన ఇమ్మ్యూనిటి బలంగా ఉందా లేదా టి సెల్స్ రక్షణ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి.

ఈ కింది వారికి తప్పించి అందరికీ ఇమ్మ్యూనిటి బలంగానే ఉంటుంది. చెక్ చేసుకోనక్కర లేదు. డెలివరీ అయిన ఆరునెలల వరకు బాలింతలు, ఆక్సిడెంట్ అయినవారు, సర్జరీ అయినవారు, బాగా ఖాయిలా పడినవారు, ఎయిడ్స్ లాంటి ఇమ్మ్యూనిటి compromise అయినవారు, వృద్ధులు, ఎర్రరక్త కణాల కౌంట్ పదిలోపు వున్నవారు. RBC కౌంట్ పెంచుకోవాలంటే ఆకుకూరలు తింటే సరి.

ఇమ్మ్యూనిటి బలంగా ఉంచుకోవాలంటే ?

1 గుడ్ డైట్ . 2 ఎండ . 3 వ్యాయామం. 4. విశ్రాంతి. 5 భయం లేకపోవడం.

షుగర్ బిపి రోగుల స్థితి. ?

uncontrolled షుగర్ అంటే 350 రీడింగ్ దాటిన వారికి ప్రమాదం. అలాగే బిపి కూడా .. చాలా ఎక్కువ ఉంటే. కరోనా కాదు. దానికంటే ముందే షుగర్ లెవెల్స్ బిపి లెవెల్స్ బాగా ఎక్కువ అయితే ప్రమాదం. దాన్ని కంట్రోల్ లో ఉంచుకొంటే ఎలాంటి సమస్య రాదు.

Also Read : ఓమిక్రాన్ ఎంత ప్రమాదకరం ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్