Sunday, February 23, 2025
HomeTrending Newsఆగ్నేయాసియా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి

ఆగ్నేయాసియా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి

చైనాలో బీఎఫ్‌-7 కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఇక ఇండియాలోనూ పలు చోట్ల చాలా స్వల్ప సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ .. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కావాల్సినంత మెడికల్ ఆక్సిజన్‌ను స్టాక్‌లో పెట్టుకోవాలని రాష్ట్రాలను కోరింది. కోవిడ్ ఎమర్జెన్సీ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నది. కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ ఇవాళ అన్ని రాష్ట్రాలకు లేఖను కూడా రాశారు.

చైనా, థాయిలాండ్, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ దేశాల నుంచి వచ్చే వారికీ RTPCR పరీక్ష తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చే భారతీయులు ఎక్కువగా హాంకాంగ్ మీదుగా రావటం పరిపాటి. దీంతో కేంద్రం కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్