తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ జాగ్రత్తలు అందరూ పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనాపై మరింత అప్రమత్తం అవసరమని తెలిపింది. వైరస్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఎలా ఇస్తున్నారన్న దానిపై నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది.
కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన కోర్టు..ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. గతకొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటింది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 29 వేలకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. వైరస్ పట్ల అప్రమత్తం ముఖ్యమని సూచిస్తోంది.
Also Read : ముంబై, కేరళలో భారీగా కరోనా కేసులు