Sunday, November 24, 2024
HomeTrending NewsGanta Srinivasarao: కౌంట్ డౌన్ మొదలైంది : గంటా

Ganta Srinivasarao: కౌంట్ డౌన్ మొదలైంది : గంటా

లోకేష్ పాదయాత్ర విరామం లేకుండా కొనసాగుతోందని, గతంలో ఏమి చేశామో చెబుతూ..భవిష్యత్తులో ఏమి చేస్తామో కూడా చెబుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.  టిడిపి ప్రభుత్వ హయంలో తాము చేపట్టిన ప్రాజెక్టుల దగ్గర ఫొటోలు దిగుతూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారని తెలిపారు.  గతంలో ఎంతోమంది జాతీయ నేతలు కూడా యాత్రలు చేశారని, కానీ ఒక్క జగన్ మోహన్ రెడ్డి చేసింది మాత్రం రిలే పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విరామం ఇచ్చి మళ్ళీ సోమవారం ఉదయం కొనసాగించేవారని గుర్తు చేశారు.

లోకేష్ యాత్ర విఫలమైందంటూ గతంలో అధికార పార్టీ ప్రచారం చేసిందని, ఎప్పుడైతే ప్రజలు తండోపతండాలుగా వస్తూ బ్రహ్మరథం పడుతున్నారో  చూసి వారు దుష్ప్రచారం ఆపారని పేర్కొన్నారు. లోకేష్ ఓ పరిపూర్ణమైన నేతగా రూపాంతరం చెందుతున్నారని, ప్రజలతో మమేకం అవుతున్నారని గంటా ప్రశంసించారు.  ఎమ్మెల్యే కోటాతోపాటు  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారని, సౌండ్  లేకుండా రౌండ్ వేశారని అభివర్ణించారు.  రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి పట్ల ఏ విధంగా ఆకర్షితులవుతున్నారో  వెల్లడి చేశారని గంటా వివరించారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయని, ఈ ప్రభుత్వానికి ఇంకా ఏడాది సమయమే ఉదని,  కౌంట్ డౌన్ మొదలైందని, నేటి నుంచి 355 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు.

జాతీయ, రాష్ట్రానికి సేవ చేసిన నాయకుల గౌరవార్ధం కొన్ని ప్రాజెక్టులకు పార్టీలకు అతీతంగా పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని, చంద్రబాబు సిఎం గా ఉండగా హైదరాబాద్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డిల పేర్లు  పెట్టారని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం ఉన్న పేర్లు మార్చడం శోచనీయమని గంటా విమర్శించారు.

సీతకొండ వ్యూ పాయింట్ కు అబ్దుల్ కలాం పేరును మార్చి వైఎస్సార్ పేరు మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం ఉన్నప్పటినుంచీ ఈ వ్యూ పాయింట్ ఉందన్నారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు పేరు మార్చడం సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్