Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్Ben Stokes: గొప్ప కాంపిటీటర్ : కోహ్లీ ప్రశంస

Ben Stokes: గొప్ప కాంపిటీటర్ : కోహ్లీ ప్రశంస

వన్డే క్రికెట్ ఫార్మాట్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులను నివ్వెర పరిచింది. ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్ సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోచిన్సిన స్టోక్స్ ఇంతే హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మూడు ఫార్మాట్లలో కొనసాగడం కష్టంగా ఉందని, అందుకే వన్డేల నుంచి  తప్పుకుంటున్నట్లు నిన్న బెన్ స్టోక్స్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టు నేడు తొలి వన్డే ఆడనుంది, ఇదే తనకు చివరి మ్యాచ్ అని బెన్ వెల్లడించాడు. ఇప్పటివరకూ 104 మ్యాచ్ లు ఆడిన స్టోక్స్ 95.3 యావరేజ్ తో 2919 పరుగులు చేశాడు.

బిజీ షెడ్యూల్ తో ఆటగాళ్లకు పిచ్చేక్కుతోందని అందుకే బెన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాపయడ్డారు.

ఇప్పటివరకూ తాను ఆడిన క్రీడాకారులందరిలో అత్యుత్తమ కాంపిటీటర్ అంటూ బెన్ స్టోక్స్ పై విరాట్ కోహ్లీ ప్రశంశలు కురిపించారు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపాడు.

మరోవైపు అభిమానులు మాత్రం బెన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ఏం తొందర వచ్చిందని, కొన్నాళ్ళు కొనసాగాల్సిందని సామాజిక మాధ్యామాల ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్