Saturday, January 18, 2025
Homeసినిమాఅంచనాలు పెంచేసిన ఆది “సీఎస్ఐ సనాతన్” టీజర్

అంచనాలు పెంచేసిన ఆది “సీఎస్ఐ సనాతన్” టీజర్

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “సీఎస్ఐ సనాతన్”. ఈ మూవీకి శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించారు. మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వాసంతి ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా టీజర్ ను తాజాగా ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది అంటూ చిత్ర బృందానికి విశెస్ తెలిపారు.

ఈ టీజర్ విషయానికి వస్తే.. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించారు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే విధానం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ముగిసింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర నిర్మాత తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్