Sunday, January 19, 2025
Homeసినిమామార్చి 10న 'సీఎస్ఐ సనాతన్' విడుదల

మార్చి 10న ‘సీఎస్ఐ సనాతన్’ విడుదల

ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సీఎస్ఐ సనాతన్‘ ఈ చిత్రానికి శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శాంతయ్య నిర్మించారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.
దీంతో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి.

విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని.. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి ప్లస్ అని మేకర్స్ అంటున్నారు. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ చిత్రం పై టీమ్ మెంబర్స్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ ఈ సినిమాతో ఖచ్చితంగా విజయం సాధిస్తారని టీమ్ మెంబర్స్ థీమా వ్యక్తం చేశారు. మరి.. సీఎస్ఐ మూవీతో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్