Wednesday, June 26, 2024
Homeసినిమాఇకపై అలా చేయను : అభిరామ్

ఇకపై అలా చేయను : అభిరామ్

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రంగం సిద్ధమైంది. సురేష్‌ బాబు రెండో కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దగ్గుబాటి అభిరామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. .

తను నటించేబోయే తొలి చిత్రం… లవ్ బ్యాక్ డ్రాప్ తో మంచి కంటెంట్ ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా.. తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. గతంలో తాను దూకుడుగా ఉండేవాడినని అంగీకరించిన అభిరామ్ ఇప్పుడు దూకుడు తగ్గించానన్నారు. తప్పులు అందరూ చేస్తారని, ఇప్పటి వరకు చేసిన తప్పులను తెలుసుకున్నా కాబట్టి ఇకపై తప్పులు చేయకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

నా వల్ల కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని…తాతగారు కోరుకున్నట్టుగా.. నాన్నగారు ఆశించినట్టుగా ఉండాలనుకుంటున్నట్లు తన మనసులో మాటలను బయటపెట్టారు దగ్గుబాటి అభిరామ్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్