Friday, September 20, 2024
Homeసినిమాఅభిరామ్-తేజ మూవీ టైటిల్ ‘అహింస’?

అభిరామ్-తేజ మూవీ టైటిల్ ‘అహింస’?

దగ్గుబాటి సురేష్‌ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్రారంభం అయ్యిందని సమాచారం. సురేష్‌ బాబు.. అభిరామ్ తొలి చిత్రానికి దర్శకుడుగా కొంత మంది దర్శకులను పరిశీలించి ఫైనల్ గా తేజకి ఆ బాధ్యతలను అప్పగించారు. తేజ సినిమా అంటే.. ప్రేమకథ చిత్రమే అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆయన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్. ఈ మూవీ టైటిల్ ‘అహింస’ అని వార్తలు వస్తున్నాయి.

టైటిల్ ‘అహింస’ అయినా.. ఇందులో హింస ఉంటుందట. లవ్ స్టోరీతో పాటు యాక్షన్ మిక్స్ చేసిన ఈ సినిమాలో అభిరామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఆమె డేట్స్ అడ్జెస్ట్స్ కాకపోవడంతో సున్నితంగా తిరస్కరించిందని తెలిసింది. ఇప్పుడు అభిరామ్ కు జోడీగా ఉత్తరాది భామ నుపూర్ సనన్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హాట్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలే నుపూర్ సనన్. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్