Monday, February 24, 2025
Homeసినిమా‘ఛార్లి 777’ అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది : రానా

‘ఛార్లి 777’ అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది : రానా

Proud to: ‘అతడే శ్రీమన్నారాయణ’ తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్ పై సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో రక్షిత్‌కి- నాకు ఫోన్స్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ‘ఛార్లి 777’ వంటి డిఫ‌రెంట్ సినిమా చేస్తున్నార‌ని తెలియ‌గానే .. ఏదో ఇళ్ల‌ల్లో చేసేస్తార‌ని నేను అనుకున్నాను. కానీ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఎంత స్కేల్‌, స్పామ్‌లో సినిమా చేశారో అర్థ‌మైంది. చూసిన వెంట‌నే క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చాయి. చాలా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు సాధించే సినిమాలు చేసే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ 170 రోజులు.. కాశ్మీర్ స‌హా వివిధ ప్రాంతాల్లో ఛార్లిని తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఇలాంటి ‘ఛార్లి 777’ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్