Tuesday, February 25, 2025
HomeTrending Newsరాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై

రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై

మాజీ మంత్రి, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు  రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన తో పాటు కుమారుడు హితేష్ చెంచురామ్ కూడా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు చెప్పారు. ఇకపై తమ కుటుంబం నుంచి పురందేశ్వరి మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవని, వీటిలో తాను ఇమడలేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసి కొన్ని మంచి పనులు చేసే అవకాశం తనకు కలిగిందని, దానికి తృప్తి చెంది ఇక్కడితో రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్