Monday, November 25, 2024
HomeTrending NewsYSRCP: నన్ను అవమానించారు: మంత్రి సురేష్

YSRCP: నన్ను అవమానించారు: మంత్రి సురేష్

ప్రభుత్వ పథకాలపై తెలుగుదేశం పార్టీ దుష్ర్పచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.  డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, మంత్రులు సురేష్, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయంలో ఎస్సీల జీవన ప్రమాణాలు పెరిగాయని, గతంలో కన్నా అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడు బాగా అందుతోందని వెల్లడించారు. ఎర్రగొండపాలెంలో తాము రాళ్ళు విసరలేదని, టిడిపి వారే తమపై రాళ్ళు, కర్రలు విసిరారని మంత్రి ఆరోపించారు.  అది వెళ్ళాల్సిన మార్గం కాకపోయినా బాబు అటు వైపు వచ్చి తమ ఇంటిముందు కావాలని ఆగారని వివరించారు. మూలాలు లేవంటూ తనను కించపరిచారని, ఇలా చేయడం సరికాదన్నారు.  తమ దళిత ఓట్లతోనే బాబుకు బుద్ధి చెబుతామన్నారు.

తెలుగుదేశం పార్టీ దళితుల ఆత్మాభిమానం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని, తమకు ఆర్ధిక బలం లేకపోయినా ఓటు బలం ఉందని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. దళితులకు సిఎం విదేశీ విద్య అందిస్తున్నారని, ఎస్సీ నిధులు దుర్వినియోగంకాకుండా చూస్తున్నామని అన్నారు. పథకాలు పారదర్శకంగా అమలు చేసున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. తాము ఎవరిపైనా రాళ్ళదాడి చేయలేదని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవహేళనలకు త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్