ఎన్ టీ ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం, జి. కొండూరు మండలంలో నివసించే ప్రజానీకం ఆరోగ్యం రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతోందనటంలో ఎటువంటి అనుమానాలు లేవు. పచ్చని పంట పొలాలను కుళ్ళిపోయిన మాంసంలను ఆహారంగా తీసుకునే క్రూరమైన చేపలను పెంచే అవాసాలుగా మారిపోతున్నాయి. ఇటువంటి పెంపకానికి ప్రభుత్వ అధికారులే వారదులుగా ఉండి అక్రమ మార్గంలో అనుమతులు ఇవ్వటం దేనికి సంకేతం… ప్రజల ఆరోగ్యం పట్టదా అధికారులకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎలా పోతే మాకెందుకు మా మామ్ముళ్లు మాకు వస్తే చాలు అనుకునే అవినీతికి అర్ధం వచ్చే విధంగా నడుచుకునే అధికారులు ఉన్నంతవరకు ఈ సమాజం బాగుపడదు. ప్రజలలోనే మార్పు వస్తే తప్పా అని మరికొందరు సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
పచ్చని పంట పొలాలలో….. అనుమతులు ఎలా..?
రైతే రాజు అనే నినాదాలు ఇచ్చే రాజకీయ నాయకులు పంట పండే పొలాలను వ్యర్దాలు వేసి పెంచే చేపల చెరువులకు అనుమతులు ఇవ్వమని అధికారులపై వత్తిడి తేవటం దారుణం. ఇటువంటి అనుమతులు మూలంగా జరిగే నష్ఠాలు తెలిసి ఇచ్చారా… ఎటువంటి అనుభవం లేని వ్యక్తుల వత్తిడికి లోబడి ఇచ్చారా లేక ముడుపులకు లోబడి కరెన్సీ కి కమిట్ అయ్యి అక్రమ మార్గంలో అనుమతులు వచ్చాయా అనే అనుమానాలు ప్రజలలో కధలాడుతున్న విషయాలు…
వ్యర్దాలు తినే చేపలతో ….. ప్రజా ఆరోగ్యం కష్టం
కుళ్ళి పోయిన మాంసం తినే చేపలు పల్లెటూరు ప్రాంతాలలో అందులో పచ్చని పంట పొలాలలో ఉండటం ఎంతవరకు కరెక్ట్… రక్త మాంసాలు అందులో కుళ్ళి పోయి భయంకరమైన దుర్వాసన వచ్చే వ్యర్థ మాంసంను తినే చేపలు ఒక మనిషిని సైతం కూడా అమాంతం నిముషాలు వ్యవధిలోనే మాయం చెయ్యగల శక్తీ ఈ క్రూరమైన మాంసం వ్యర్దాలు తినే చేపలకు ఉంది. ఈ చేపల మూలంగా అనేక ఆనారోగ్య సమస్యలు తలేత్తుతు ఉన్నాయి.
మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడి,కవులూరు,ఈలప్రోలు, పైడూరు పాడు,కట్టుబడి పాలెం, మునగపాడు, వెల్వడం, గణపవరం ఇలా పలు ప్రాంతాలలో ఇటువంటి కుళ్ళిపోయిన జంతు మాంసమాలతో నడిచే చేపల చెరువులు నిర్వాహకులు అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు భయంకరమైన ఆనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.