Sunday, January 19, 2025
Homeసినిమావిశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ లుక్ విడుదల

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

హీరో విశ్వక్ సేన్ తను టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’కి దర్శకత్వం వహిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ లో విశ్వక్ సేన్ చెవిపోగులు, గడియారం ధరించి స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించారు. తన కనుబొమ్మలను పై కెత్తి ఎవరికో ధంకీ ఇస్తున్నట్లుగా చూడటం ఆసక్తికరంగా వుంది. క్యూరియాసిటీని పెంచిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడనే భావన కలిగిస్తోంది.

‘దాస్ కా ధమ్కీ’ రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ యాక్షన్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈ వారం చివరికల్లా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తవుతాయి.స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇవ్వబోతున్నాయి.

రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఇందులో ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్