Saturday, April 26, 2025
Homeసినిమా'దసరా' ట్రైలర్ మార్చి 14న విడుదల

‘దసరా’ ట్రైలర్ మార్చి 14న విడుదల

నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది. మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో దసరా భారీ అంచనాలని నెలకొల్పింది. టీజర్, పాటలు నేషనల్ సెన్సేషన్ గా నిలిచి, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.

తాజాగా మేకర్స్ దసరా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మార్చి 14న దసరా ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. రావణ దహనం జరుగుతుండగా నాని గొడ్డలి పట్టుకొని ఎదురుగా నిలుచున్న పవర్ ఫుల్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్